నేలకొండపల్లి మండల కేంద్రంలోని ఎక్సైజ్ సర్కిల్ స్టేషన్లో పట్టుబడ్డ వాహనాలను శుక్రవారం వేలం వేయనున్నట్టు సీఐ. కె. జగన్నాథ రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డ అశోక్ లేలాండ్ వాహనాలు రెండింటిని వేలం వేస్తున్నట్లు తెలిపారు. ఆసక్తిఉన్న వారు 50 శాతం డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలని సూచించారు.