గత ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైనందున కల్యాణలక్ష్మి చెక్కుతో తులం బంగారం ఇవ్వడం ఆలస్యమవుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం తెలిపారు. అయినప్పటికీ త్వరలోనే నెరవేరుస్తామని, ఇచ్చిన హామీ మేరకు రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేయగా, మిగిలిన రూ. 13వేల కోట్లను డిసెంబర్ లోగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 57 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.