ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు అధైర్యపడొద్దని, చివరి గింజ వరకూ మద్దతు ధరతో కొనుగోలు చేయడమే కాక సన్నాలకు రూ. 500 బోనస్ చెల్లిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కూసుమంచిలో శనివారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్దిదారులకు ఆయన చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు కల్లాల బాట పడతామని చెబుతూ రైతుల్లో అపోహలు నింపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.