కూసుమంచి మండలంలోని రాజపేట గ్రామంలో బ్యాక్టీరియా, ఎండాకు తెగులు, కంకి నల్లి ఆశించిన వరి పొలాలను మండల వ్యవసాయ అధికారిణి రామడుగు వాణి పరిశీలించారు. అనంతరం ఆ గ్రామంలోని రైతులకు బ్యాక్టీరియా, ఎండాకు తెగులు, కంకినల్లి యొక్క లక్షణాలు వాటికి తీసుకోవలసిన సస్యరక్షణ చర్యలు గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. తెగులు ఆశించగానే పైపాటుగా నత్రజని ఎరువును వేయడం తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు.