వరదలకు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం సొసైటీ అధ్యక్షుడు జే. లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సోమవారం ఈ మేరకు ఖమ్మం కలెక్టర్ ముజుమ్మిలా ఖాన్ కు వినతిపత్రం అందించారు. వరద ప్రభావానికి కొట్టుకుపోయిన విద్యుత్ స్తంభాలను, ట్రాన్స్ఫార్మర్ లను పునరుద్ధరించాలని కోరారు. ఆకేరు వరదలకు రైతులు తీవ్రంగా నష్టపోయారని, వెంటనే బాధిత రైతులకు నష్టపరిహారం అందించాలని పేర్కొన్నారు.