కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ ఎల్లప్పుడూ ఉంటుందని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లికి చెందిన వీరబాబు ఇటీవల ప్రమాదవశాత్తు మరణించాడు. అతనికి బీఆర్ఎస్ పార్టీ నుంచి రూ. 2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కు మంజూరు కాగా, బుధవారం వీరబాబు కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే కందాల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు బెల్లం వేణు, నాయకులు పాల్గొన్నారు.