మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి గ్రామంలో గురువారం గుండాల ఏడుకొండలు (64) కు ముగ్గురు కుమార్తెలు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఏడుకొండలు గురువారం కన్ను మూశారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించడానికి కుమారులు లేక పోవడంతో ఏడుకొండలు పెద్ద కుమార్తె ఏసుమని అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.