ఖమ్మం జిల్లా మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా ఎర్రుపాలెం మండలానికి చెందిన బండారు నరసింహారావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మార్కెట్ అధికారులు వారికి ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మార్కెట్ డైరెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.