ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, బానిసత్వం నుండి బయటపడటానికి పోరాటం చేసిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ గురువారం కొనియాడారు. మధిర మండలం మల్లవరంలో సీపీఐ సభ్యత నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాయకులు మందడపు వెంకయ్య, మంగమ్మ దంపతులకు ఆయన సభ్యత్వాన్ని అందించారు. వెంకయ్య లాంటి కమిట్మెంట్ ఉన్న కామ్రేడ్స్ జీవితాన్ని ప్రస్తుత యువత అనుచరించాల్సిన అవసరం ఉందన్నారు.