మధిర పట్టణానికి చెందిన ఆర్కిటెక్ట్, మున్సిపల్ లైసెన్స్డ్ ప్లానర్ వేములపల్లి అప్పారావు మాతృమూర్తి, భూలక్ష్మీ దేవి ఇటీవల మరణించగా వారి నేత్రాలను ఖమ్మం నేత్రనిధి ద్వారా దానమిచ్చి ఇద్దరి కార్నియా అంధులకు చూపునందించారు. ఈ సందర్భంగా ఖమ్మం నేత్ర నిధి సంస్థ సభ్యులు ఆదివారం వారి కుటుంబ సభ్యులకు సర్టిఫికెట్లను అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు.