మధిర మండల బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం మధిర నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వవలసిన వర్షాకాల రైతు భరోసా ఎగ్గొట్టిన కారణంగా ప్రభుత్వం చేస్తున్న విధానాలకు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతులకు రైతు భరోసా అందించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు చిత్తూరు నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.