ఖమ్మం జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం లగచర్ల రైతులకు సంఘీభావం తెలుపుతూ బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో పెవిలియన్ గ్రౌండ్ నుండి అంబేద్కర్ సెంటర్ (జెడ్పీ సెంటర్) వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.