ఖమ్మం జిల్లా మధిర శాసనసభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం ఇందిరాగాంధీ వ్యవసాయ ప్రతిభా పురస్కారాల అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. దేశంలో ఒకే రోజు రూ. 18 వేల కోట్లు రుణమాఫీ చేసి దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని తెలిపారు.