ఖమ్మం జిల్లాలో ఇటీవల అక్రమ కేసులో చింతకాని మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెంట్యాల పుల్లయ్య అరెస్ట్ అయి జైలుకు వెళ్ళి వచ్చినారు. ఆయనను పరామర్శించేందుకు రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు 22 న ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని ప్రొద్దుటూరు గ్రామానికి రానున్నారు అని మంగళవారం బీ ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తెలిపారు.