మధిర శాసన సభ్యులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదివారం పలువురు మంత్రులు, అధికారులతో వారి కార్యాలయంలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డి ఫాల్టర్లకు ఎట్టి పరిస్థితుల్లో ఈ సీజన్లో ధాన్యం కేటాయించబోమని స్పష్టం చేశారు. అలాగే డి ఫాల్టర్ల విషయంలో కఠిన వైఖరి అవలంబించాలని నిర్ణయించినట్టు తెలిపారు.