ఖమ్మం నగరంలోని వాకర్స్ ప్యారడైజ్ ను సోమవారం మేయర్ పునుకొల్లు నీరజ సందర్శించారు. వాకింగ్ ట్రాక్ ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ట్రాక్ పక్కన ఉన్న చెట్లకొమ్మలను ట్రిమ్ చేయాలని, గతంలో తీసివేసిన కోనోకార్పస్ మొక్కల స్థానంలో వేరే మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. అనంతరం లకారం ట్యాంక్ బండ్ పై ఉన్న ఓపెన్ జిమ్మును పరిశీలించారు. పక్కన ఉన్న పెద్దవాగు పూడికతీత పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.