అకస్మాత్తుగా వచ్చిన వరదల్లో నష్టపోయిన ప్రతీ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ తెలిపారు. ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో యుగంధర్ తన తనయుడు ప్రయాగ్తో కలిసి వరద బాధితులు, విద్యార్థులకు నిత్యావ సర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రతీ డివిజన్లో విద్యార్థులకు పంపిణీ చేసేలా కేఎంసీ సిబ్బందికి నోట్ పుస్తకాలను అందించారు.