వైరా రిజర్వాయర్ ను ఆనుకొని ఉన్న రాజీవ్ నగర్ లోతట్టు ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులతో కలిసి పరిశీలించారు. అంతకుముందు మత్స్యకారులతో కలిసి రిజర్వాయర్లో తెప్పపై వెళ్లి రిజర్వాయర్ ను పరిశీలించారు. వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. ఆయన వెంట పలువురు అధికారులు పాల్గొన్నారు.