రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను పట్టణ వాసులు సద్వినియోగం చేసుకుంటున్నారు. శనివారం పట్టణ వాసులు అధిక సంఖ్యలో వ్యాయామం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు ప్రతిరోజు వాకింగ్‌తో పాటు జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ సందడి చేస్తున్నారు.