రుద్రంగి మండల కేంద్రంలోని సర్వే నంబర్ 428/2, 428/3, 428/4, మూడు సర్వే నెంబర్లలోని ప్రభుత్వ భూమిని ప్రయివేట్ వ్యక్తులు అన్యాక్రాంతం చేసి అక్రమ భవనాలు నిర్మిస్తున్నారని పిట్టల నరేష్ అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్ వేశారు. మంగళవారం గ్రామపంచాయతీలో విచారణ చేపట్టారు. డిఎల్పిఓ నరేష్ స్థానిక పంచాయితీ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. భూమి అన్యాక్రాంతం అయిందా లేదా అని డాక్యుమెంట్లను పరిశీలించారు.