జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన లో ఖాళీగా ఉన్న పలు వైద్య పోస్ట్ లు కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. జీజీహెచ్ లోని బ్లడ్ బ్యాంక్, ఎమర్జెన్సీ వార్డ్ ల్లో నాలుగు పోస్టులకు ఖాళీ ఏర్పడగా, ఆయా పోస్టులకు సివిల్ అసిస్టెంట్ అర్హతగా నిర్ణయించి, దరఖాస్తులు ఆహ్వానించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధ్యక్షతన ఇంటర్వ్యూలు నిర్వహించారు.