రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల గ్రామంలోని శ్రీ గోవిందరాజుల స్వామి వారి ఆలయంలో మంగళవారం రాత్రి గ్రామానికి చెందిన ప్రజలు అధిక సంఖ్యలో కుటుంబ సమేతంగా తరలివెళ్లి భక్తిశ్రద్ధలతో ఆలయంలో దీపాలు వెలిగించారు. దీంతో ఆలయం దీపాల కాంతుల్లో దేదీప్యమానంగా కనువిందు చేస్తుంది. బుధవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీగోవిందరాజుల స్వామి వారి ఆలయం కన్నుల పండువగా జరగనుంది.