చందుర్తి మండల కేంద్రంలోని స్థానిక గౌడ కులస్తుల ఆధ్వర్యంలో శ్రీరేణుకా దేవి ఆలయ ఆవరణంలో నిర్మించనున్న శ్రీమల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి ఎన్నారై మోతే రాములు గత నెల రోజుల క్రితం విరాళాన్ని ప్రకటించారు. మంగళవారం రూ. 10 లక్షల 10 వేల 16 చెక్కును గౌడ సంఘం పెద్దమనుషులకు మోతే రాములు కుమారుడైన మోతే భరత్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు, గ్రామ ప్రజలు ఉన్నారు.