అక్రమంగా గంజాయి సేవించి క్రయవిక్రయాలు జరిపిన కఠిన చర్యలు తప్పవని సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం హెచ్చరించారు. క్రాంతి సాగర్, గణేష్, వంశీయులు కలిసి గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొనుక్కొని సిరిసిల్లలో అభినయ్ అనే వ్యక్తికి అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి 440 గ్రాముల గంజాయిని, 3 మొబైల్ ఫోన్లను, ఒక బైకును స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.