సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేట ప్రాధమిక పాఠశాలలో శుక్రవారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ రోజు కొంత మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలను బోధించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మజ, ఉపాధ్యాయులు పల్లవి, తదితరులు పాల్గొన్నారు.