పట్టణాభివృద్దే లక్ష్యంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి పట్టణంలోని 13, 14వ వార్డుల్లో రూ. 67. 58 లక్షల టియు ఎఫ్ఐడిసి నిధులతో చేపడుతున్న బీటీ, సీసీ రోడ్ల పనులు, సీసీ మురికి కాలువలు నిర్మాణ పనులకు ఆదివారం ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.