పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం మంథని పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. మంథని పట్టణంలోని శ్రీరామ్ నగర్ 4వ వార్డులో ఇంటింటి సర్వే సన్నద్దత, వ్యవసాయం మార్కెట్ యార్డు, ఎంసిహెచ్ కేంద్రం, ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ సందర్శించారు. ఇంటింటి సర్వే కోసం హౌస్ లిస్టింగ్ పక్కాగా చేపట్టాలని, వేరే బృందాలు సర్వే చేయాల్సి వచ్చిన ఎలాంటి ఇబ్బందులు రాకుండా మ్యాపింగ్ ఉండాలని సూచించారు.