జిన్నింగ్ మిల్లులకు వచ్చే పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన పత్తిని మద్దతు ధరపై కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులకు సూచించారు. సోమవారం సుల్తానాబాద్ మండలం వెంకటేశ్వర జిన్నింగ్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి మనోహర్ పాల్గొన్నారు.