వికారాబాద్ జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు బొంకూరి శంకర్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి కలెక్టరేట్ లో మంగళవారం భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులను నెరవేర్చడమే ఉద్యోగుల లక్ష్యమని, అలాంటి వారిపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. అనంతరం కలెక్టర్ కోయ శ్రీ హర్షకు వినతిపత్రం అందజేశారు.