పెద్దపల్లి మండలం రాఘవపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం క్షయవ్యాధి నివారణపై అవగాహన కల్పించారు. టీబీ అలెర్ట్ ఇండియా ఆద్వర్యంలో ఇంపాక్ట్ ఇండియా ప్రాజెక్ట్ టీబీ చాంపియన్ శిక్షణలో భాగంగా ప్రజలను చైతన్య పరిచేందుకు అవగాహన కల్పించినట్లు డిప్యూటీ డిఎంహెచ్ఓ డా. శ్రీరాములు, జిల్లా టీబీ అధికారి డా. సుధాకర్ రెడ్డి తెలిపారు. పీహెచ్సీ వైద్యాధికారి డా. మమత, హెచ్ఈఓ సాంబయ్య, టీబీ సూపర్వైజర్ తిరుపతి పాల్గొన్నారు.