తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్- 3 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మంథని జెఎన్టియు ఇంజనీరింగ్ కళాశాలలో గత రెండు రోజులుగా జరిగిన పరీక్షలో కేవలం 36 శాతం మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. సోమవారం జరిగిన పరీక్షలో 768 మందికి గాను 281 మంది మాత్రమే హజరవ్వగా 487 మంది గైర్హాజరయ్యారని ప్రిన్సిపాల్ చెరుకు శ్రీధర్ రెడ్డి తెలిపారు.