విషజ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ కోరారు. శుక్రవారం డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 14, 22వ వార్డులలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఇంట్లో ఎళ్లే తడిపొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు షాహీద సాబీర్ ఖాన్, ఉప్పు స్వరూప రాజు, వార్డు ఆఫీసర్లు దిలీప్, శ్రీనివాస్ పాల్గొన్నారు.