రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను ఎలాగైతే పెట్టారో, అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టేలా ఆదేశాలు జారీ చేయాలని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి డిమాండ్ చేసారు. ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాలను తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విజయ్ కుమార్, మండల పరిషత్ కార్యాలయంలో పర్యవేక్షకులు శ్రీనివాస్ లకు గురువారం అందించారు.