సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చొరబడ్డ నాగుపాము

75பார்த்தது
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చొరబడ్డ నాగుపాము
జగిత్యాల సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం నాగు పాము చొరబడింది. వరుస సెలవులతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోగా కార్యాలయ పని వేళల్లో పాము కార్యాలయంలో సంచరిస్తుండటాన్ని గుర్తించిన సిబ్బంది పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించారు. ఆ వ్యక్తి పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే కార్యాలయంలో పిచ్చి మొక్కలు పెరిగి విష సర్పాలు సంచరిస్తున్నాయని వారు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி