ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని క్యాజువాలిటీ బాత్రూంలో నెలలు నిండని భ్రూణ శిశువు మృతదేహం లభ్యమైంది. దీంతో ఆసుపత్రి వర్గాలు ఒక్కసారి ఉలిక్కిపడ్డాయి. పోలీసులు విషయం తెలుసుకొని రంగ ప్రవేశం చేశారు. పోస్టుమార్టం కోసం శిశువును మార్చురీకి తరలించగా పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.