ధర్మారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ధర్మారం ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, అధికారులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.