జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని సిమెంట్ కాంక్రీట్ రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైందని ప్రజలు వాపోతున్నారు. ఇటీవల కురిసిన చిన్న చిన్న వర్షాలకి ఈ సిమెంట్ కాంక్రీట్ రోడ్లు కాలువలను తలపించే విధంగా తయారయ్యాయని ఆయా కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు. ఈ రోడ్ల వల్ల వర్షాకాలానుగుణ వ్యాధులు సోకే అవకాశం ఉందని, సంబంధిత అధికారులు స్పందించి చర్యలు గైకొనాల్సిందిగా వారు కోరుతున్నారు.