ధర్మపురిలో జగిత్యాల కలెక్టర్ పూజలు

54பார்த்தது
ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ముందుగా దేవస్థానం సాంప్రదాయం ప్రకారం మేళతాళాలతో, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం స్వామివారి శేష వస్త్రం, ప్రసాదం అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాస్, అర్చకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி