జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం బూర్గుపల్లి శివారులో మామిడితోటలో మంచిర్యాల, వరంగల్, కరీంనగర్, రామగుండం నుండి 20 మంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు పేకాట స్థావరంపై సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గురువారం దాడి చేసి 9 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 3500 నగదు, 1, 56, 000 రూపాయల విలువ గల కాయిన్స్, 9 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో సీసీఎస్ సీఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.