ఈ నెల 10 వ తేది నుండి ప్రారంభం కానున్న ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం రాత్రి పరిశించారు. గోదావరి ఒడ్డున నెలకొని ఉన్న శ్రీరాముల వారి దేవాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి కల్యాణం నిర్వహించే స్థలాన్ని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని తగు సూచనలు చేశారు.