మహిళలకు పట్టం కడుతూ పైచేయిగా నిలపడంలో కాంగ్రెస్ పార్టీ ముందుందని జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి అన్నారు. శనివారం ధర్మపురి మండల కేంద్రంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు ఆమె ఆత్మీయ అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి శోభారాణి, నాగలక్ష్మి పాల్గొన్నారు.