మల్యాల మండలంలోని అన్ని గ్రామాల్లో రైతులు పంట కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన కొనేవారు లేరని మండల బీజేపీ నాయకులు అన్నారు. వెంటనే కొనుగోలు ప్రారంభించాలని మల్యాల తాహశీల్దారు వినతిపత్రం ఇచ్చారు. పలు గ్రామాల్లో ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించని దుస్థితి ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కుప్పలను పోసుకొని రైతులు రోజుల తరబడి కొనుగోలు కోసం ఎదురుచూస్తున్న పట్టించుకునేవారు లేరన్నారు.