ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో గురువారం అధికారులు హుండీ లెక్కింపు చేపట్టారు. శ్రీ లలిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 75 రోజుల పాటు 1,04,36,365 రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. అలాగే 60 గ్రాముల మిశ్రమ బంగారం, 3 కేజీల మిశ్రమ వెండి, 78 కరెన్సీ నోట్లు వచ్చినట్లు తెలిపారు. ఈ లెక్కింపులో సహాయ కమిషనర్ సుప్రియ, ఈ ఓ రామకృష్ణారావు, సిబ్బంది పాల్గొన్నారు.