నాగిరెడ్డిపేట్లోని కేరళకు చెందిన శ్రీసాయి ప్రైవేట్ పాఠశాలలను శనివారం ఎంఈఓ భాస్కర్ రెడ్డి సందర్శించి పాఠశాలల రిజిస్టర్ బుక్కులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ కేరళ శ్రీ సాయి ప్రవేట్ పాఠశాలలు భవన మౌలిక వసతులను మెరుగుపరుచుకోవాలని, పిల్లల భద్రత చర్యలు తీసుకొని విద్యా సామర్థ్యాలు మెరుగుపరచుకొని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి బోధన సామర్థ్యాలు పెంచాలన్నారు.