ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల సొసైటి ఆధ్వర్యంలో నిజామాబాద్ పొలిమేరలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద బుధవారం ఉదయం రైతులు సన్నరకం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో డీఎస్పీ ఏ. శ్రీనివాసులు, ఎస్ఐ బొజ్జ మహేష్, జిల్లా జాయింట్ కలెక్టర్ విక్టర్ లు కొనుగోలు కేంద్రం వద్దకు చేరుకుని రైతులతో మాట్లాడారు.