ఎల్లారెడ్డి సెగ్మెంట్ సదాశివనగర్ కు చెందిన బోగిని రాజు(49) మద్యానికి బానిసై ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ రంజిత్ తెలిపారు. బుధవారం ఎస్ఐ. మాట్లాడుతూ. గత కొన్నేళ్లుగా మద్యానికి బానిసై, జీవితంపై విరక్తిచెంది ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపారు. మృతుడి తల్లి రాజమణి ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.