మంత్రి పదవిపై పెద్దపల్లి ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో కేబినెట్ విస్తరణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఆశావహుల జాబితాను రాష్ట్ర అధినాయకత్వం హైకమాండ్‌కు పంపింది. ఈ క్రమంలోనే బుధవారం మంత్రి పదవిపై పెద్దపల్లి ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాక కుటుంబంలో ఒకరికి మంత్రి పదవి ఇస్తామని అన్నారని తెలిపారు. అందుకు సీఎం రేవంత్ కూడా హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. తనకు మాలల అభివృద్ధి, హక్కులు ముఖ్యమని మంత్రి పదవి కాదన్నారు.