నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో గురువారం చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మహిళా పోరాట శక్తికి ప్రతీక అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ దండు నీతూకిరణ్ సిబ్బంది పాల్గొన్నారు.