ఎంఐఎం చీఫ్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ ఫొటోను మార్ఫింగ్ చేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు బుధవారం నిజామాబాద్ వన్ టౌన్ ఎస్సై రఘుపతి తెలిపారు. ఒవైసీ ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన జిల్లా కేంద్రానికి చెందిన మాలపల్లికి చెందిన మాజీ కార్పొరేటర్ ఎంఏ ముఖీత్, ముంబైకి చెందిన సోషల్ మీడియాకు సంబంధించిన కలీంషేక్పై ఎంఐఎం అధ్యక్ష, కార్యదర్శుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు.