నిజామాబాద్ నగరంలో చోరీ
నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తాలోని ఓ మెడికల్ షాపులో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు శుక్రవారం అర్థరాత్రి మెడికల్ షాప్ షెట్టర్లు ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. మెడికల్ షాపులో ఉంచిన సుమారు రూ. లక్షల నగదు అపహరించారని బాధితుడు తెలిపారు. రూరల్ ఎస్ఐ ఆరీఫ్ ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.